తేది:- 15-10-2022 సమయం:- 23:27 గంటలు
కవి పరిచయం - పంచపది కవిరత్నాలు:
20. శ్రీ డా. పి. వి. ఎల్. సుబ్బారావు గారు
పేరు: డా. పెద్దాడ వేంకటలక్ష్మీ సుబ్బారావు
జననం: 18-05-1955
విద్యార్హతలు: బి.ఎస్సి; ఎమ్.ఏ; ఎమ్.ఇడి; పిహెచ్.డి; సాహిత్యరత్న
వృత్తి: ఉపాధ్యాయుడు (1976-2013); ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ
ప్రవృత్తి: శ్రోత, వక్త, కవి, రచయిత
నివాసం: విజయనగరం, ఆంధ్రప్రదేశ్
అమ్మ, నాన్న: కీ.శే. సుబ్బలక్ష్మీ, వేంకట లక్ష్మీ నరసింహారావు
5గురు అన్నదమ్ములు, 3గురు అక్కచెల్లెళ్ళలో నేను పెద్దవాడ్ని
ధర్మపత్ని: కూరాడ వీరమాత (విశ్రాంత హిందీ టీచర్)
అమ్మాయి - అల్లుడు: లక్ష్మి, శ్రీకృష్ణ
మనుమలు: సాయి అనిరుధ్, సాయి సిద్ధార్థ్, సాయి అమృత్
కొడుకు - కోడలు: నరసింహ తేజ, డా. ప్రసన్నలక్ష్మి
మనుమలు: అవ్యాంశ్, శ్రేయాంశ్
సత్కారాలు:
పిహెచ్.డి. స్వర్ణపతకం
2006లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు
2007లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు
2008లో ఎ.బి.ఎస్. (యు.ఎస్.ఎ) స్వర్ణపతకం
సాహితీ సంస్థల, స్వచ్ఛంద సంస్థల గౌరవాలు
రచనలు:
ప్రేమ (2021)
జయభేరి (2021)
కరోనా కవిత్వం (2021)
(వెబ్సైట్: https://pvlsubbarao.in/corona-kavitvam)
శంకర తవచరణం, శరణం (2021)
తెనుగువచన కవితా సంకలనం (2019)
మరణాంతర జీవనం (2019)
తెనుగు వచన కవితా సంకలనం (2017)
నిజం (2015)
అవతార్ (2015)
కొమ్మలు-కంఠాలు (2015)
శంఖారావం (2015)
గుండె తలుపు తట్టాలి (2015)
సకోరా (హిందీ: सकोरा) (2015)
శాంకర సంవత్సరం (2007)
నీ మనిషిని నేను (1987)
పంచపదులపై శ్రీ డా. పి. వి. ఎల్. సుబ్బారావు గారి అభిప్రాయం
రచనలు చేసేవారికి నిత్యసాధనగా ఉపయోగ పడుతుంది. నిత్యం సాహితీ అంశాలను అవగాహన చేసుకొనుటకు వీలుకలుగుతుంది.
అందరినీ కూడగట్టుకుని చేసే సాహిత్య ఉద్యమంగా, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకునే వేదికగా, సాహిత్య వ్యాసంగాన్ని తీర్చి దిద్దుకునే అవకాశం కల్పిస్తుంది.
వివిధ ప్రాంతాలవాళ్ళు, అక్షర బంధంతో ఒక్కటి అవుతున్నారు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు, విషయావగాహన పెంచుకుంటున్నారు.
విషయవైవిధ్యం రచనా సామర్థ్యం పెంచుతోంది, భావవ్యక్తీకరణలో నిపుణత సాధించుటకు ఉపకరిస్తుంది.
"అనగ అనగ రాగమతిశయించుచుండు" అన్న వేమన సూక్తి నిజమవుతోంది, కవిత్వీకరణలో విభిన్నత, వైవిధ్యభరిత యోచనలకు అవకాశం కలుగుతుంది.
పంచపదులకు ఏ రకమైన ఖ్యాతిని కలిగించవచ్చు.
పంచపదుల ఆశయాన్ని విస్తరింపచేయడం ద్వారా పంచపదులకు ఖ్యాతి, విఖ్యాతి, ప్రఖ్యాతి సాధించి, తద్వారా వ్రాసే కవులు, కవియత్రులకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక విధంగా, ఇది ఉభయతారకము. దీని వలన ఒక ప్రక్క పంచపది వేదిక ద్వారా కవుల సాహితీ ప్రతిభ వెల్లడవుతుంది, మరో ప్రక్క కవుల సాహితీ కృషి వల్ల పంచపదులకు, పంచపది సమూహానికి విలువ పెరుగుతుంది. సులభమైన శైలి వల్ల భావాభివ్యక్తి చేయడంలో కవికి ఎక్కువ అవకాశం వుంటుంది, మరియు అంత్యానుప్రాసల వల్ల లయాత్మకత, గాన యోగ్యత కలుగుతుంది. ప్రతి పంచపదిలో కవి నామం వుండడం వల్ల కవికి వ్యక్తిగతంగా గుర్తింపు, కీర్తి, ప్రతిష్ట వస్తుంది.
ఈ ప్రక్రియ రూపకర్త శ్రీ కాటేగారు పాండురంగ విఠల్ గారు పంచపదితో పాటు తెలుగు, హిందీలో బాలపంచపది ప్రక్రియ రూపొందించి, బాలల స్థాయికి తగిన అంశాలతో బాల పంచపదులు రాయించడం, నేను హిందీ, తెలుగు భాషల్లో రాయడం సంతోషదాయకం. ఇదియే కాకుండా, సప్తవర్ణ సింగిడి ద్వారా మరో సమూహంలో ఏడు రోజులు ఏడు విధములైన పంచపదులు రాయించడం అద్భుతమైన ఆలోచన. ఇందులో ఒక కవి ఇచ్చిన దాన్ని, మరో కవి రాయడం సృజనాత్మకతకు దోహదపడుతుంది.
నా అనుబంధము
బాల పంచపదులు: 535 +
పంచపదులు: 800 +
హిందీ బాలపంచపదులు: 104
నా రచన అనుభవము 1987 నుండి కొనసాగుచున్నది, "నీ మనిషిని నేను" తొలి తెలుగు వచన కవితా సంపుటి. నేటికి 35 సంవత్సరములు పూర్తి అయినవి.
నేను ఈమధ్య కాలంలో సాధించిన విషయాలు, విజయాలు:
సాహిత్య భారతి, అనంతపూర్, శ్రీశ్రీ కళావేదిక, సేవా సాహితీ వేదిక, సరస్వతి కళాపీఠం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వశాఖ), కర్ణాటక విశ్వవిద్యాలయం వారి ప్రశంసా పత్రాలతో పాటు ఇంకా 20 దాకా పొందాను.
పంచపది కవనవేదిక ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 400 పంచపదులు రాసినందుకు ప్రత్యేక ప్రశంసాపత్రం పొందడం జరిగినది.
పంచపది కవనవేదిక అభిప్రాయం
శ్రీ డా. పి. వి. ఎల్. సుబ్బారావు గారు పంచపది సమూహంలో వచ్చి అనతి కాలంలోనే తెలుగు, హిందీ భాషల్లో 500 పంచపదులు రాయడం చాలా గొప్ప విషయం. దాదాపు 35 సంవత్సరాల సాహితీ ప్రయాణంలో తెలుగు, హిందీ భాషల్లో 15 పుస్తకాలు ముద్రించారు. నిరంతర సాహితీగంగాప్రవాహం వలే వీరి రచనలు కొనసాగుతున్నాయి. బాలపంచపదులు (తెలుగు, హిందీ), పంచపదులలో ఇచ్చిన ప్రతి అంశానికి ఓ మకుటంతో రాయడం ఈయన ప్రత్యేకత. ఏ అంశమిచ్చినా వాటి మూలాలలోకి వెళ్లి, శోధించి రాయడంలో సిద్ధహస్తుడు. ఆయన ముద్రిత రచనలలో తెలుగు, హిందీ పంచపది గ్రంథాలకు త్వరలోనే స్థానం కల్పించాలని కోరుతున్నాము. పంచపది సమూహం తరపున ఉడుతాభక్తిగా ప్రచురించదలచిన వారికి నేను వెయ్యి రూపాయలు ఇవ్వదలిచాను. కావున మీతోనే శ్రీకారం చుట్టగలరు. మీ ద్వారా పంచపదులకు ఖ్యాతి రావాలని, మీ పంచపది సాహితీస్రవంతి ఇలాగే కొనసాగాలని, దానికై ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాము.
పంచపదులలో శ్రీ డా. పి. వి. ఎల్. సుబ్బారావు పంచపది కవిరత్నగారి పరిచయం
సుబ్బలక్ష్మి - వేంకటలక్ష్మీ నరసింహాకు జన్మించారు
శ్రీ పి. వి. ఎల్., కూరాడ వీరమాతను వివాహమాడారు.
శ్రీ సుబ్బారావు వక్త, కవి, రచయితగా రాణించారు,
లక్ష్మి, నరసింహతేజ... ఇరువురిని జన్మనిచ్చారు.
పిహెచ్. డి. సాధించి, ఉపాధ్యాయుడిగా కొనసాగారు విఠల్!
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా,
ఏ. బి. యస్. (యు. ఎస్. ఏ.) స్వర్ణపతక విజేతగా,
సాహితీ స్వచ్ఛందసంస్థల పురస్కార గ్రహీతగా,
పంచశత పంచపది (ద్విభాషల్లో) కవన కర్తగా,
సుబ్బారావు విజయనగరానికే వన్నె తెచ్చారు విఠల్!
నీ మనిషిని నేను, గుండె తలుపు తట్టాలి, నిజము,
శాంకర సంవత్సరం, వచన కవితా సంకలనము,
కొమ్మలు - కంఠాలు, అవతార్, ప్రేమ, మరణాంతర జీవనము,
శంకర తవ చరణం శరణం, కరోనా కవిత్వము,
వీటితో పాటు సకోరా (హిందీ) పుస్తకాలు ముద్రించారు విఠల్!
సాహిత్య భారతి, అనంతపూర్ వారి ప్రశంసాపత్రము,
అజాదీ కా అమృత్ మహోత్సవపు సన్మానపత్రము,
కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయం సన్మానము,
పంచపది ప్రథమవార్షికోత్సవ ప్రశంసాపత్రము,
శ్రీశ్రీ, సేవా, సరస్వతి కళా పీఠం ప్రశంసాపత్రాలు పొందె విఠల్!
- శ్రీ కాటేగారు పాండురంగ విఠల్,
పంచపది రూపకర్త,
హైదరాబాద్.
సెల్: +91 9440530763